సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అయ్యో నేనే కా అన్నిటికంటెఁ దీలు
పల్లవి:

అయ్యో నేనే కా అన్నిటికంటెఁ దీలు
గయ్యాళినై వ్రిధా గర్వింతుఁ గాని

చరణం:

తడిపివుదికినట్టి ధౌతవస్త్రములు నా-
యొడలు మోఁచినమీఁద యోగ్యము గావు
వుడివోక వనములో వొప్పైనవిరులు నే-
ముడిచి వేసినంతనే ముట్టరాదాయను ॥అయ్యో॥

చరణం:

వెక్కసపు రచనల వేవేలు రుచులు నా
వొక్కనాలుకంటితేనే యోగ్యముగావు
పక్కన దేవార్హపుఁ బరిమళ గంధములు నా-
ముక్కుసోఁకినంతలోన ముట్టరాదాయను ॥అయ్యో॥

చరణం:

గగనాననుండి వచ్చేగంగాజలములైన
వొగి నాగోరంటితేనే యోగ్యము గావు
నగు శ్రీవేంకటపతి నన్నే రక్షించినదాఁక
మొగడై యెరుక తుదిముట్టరాదాయను ॥అయ్యో॥

అర్థాలు

తీలు = అల్పత్వం, గయ్యాళి = ధిక్కరించి మాట్లాడుట, విరులు = పూవులు, యెరుక = తెలివి

వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం