సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: బాలులతో వీథుల్లో
టైటిల్: బాలులతో వీథుల్లో
పల్లవి:
ప|| బాలులతో వీథుల్లో బారాడువాడు | కోలలెత్తుక వుట్లు గొట్టీజుండీ ||
చరణం:చ|| నారికడపువక్కలు నానినసనగలు | చారపప్పు దేనెలు చక్కరెలును |
పేరిననేతులు నానబియ్యాలు నుట్లనవే | చేరి యశోదబిడ్డకు జెప్పేరుసుండీ ||
చ|| చక్కిలాలు నడుకులు సనిగెపప్పులును | చెక్కినమెత్తని తూటచెఱకులును |
పెక్కువగా నుట్లలో బిందెల నించినవవే | చక్కనెశోదబిడ్డకు జాటేరుసుండీ ||
చ|| నువ్వులు జిటిబెల్లాలు నున్నని చిమ్మిలులు | నువ్వుటిడియును జిన్నినురుగులును |
యెవ్వారు వేంకటపతి కెఱుగించ నారగించి | కివ్వకివ్వ నవ్వ నణకించీజుండీ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం