సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: బాపు బాపు కృష్ణా బాలకృష్ణా
పల్లవి:

బాపు బాపు కృష్ణా బాలకృష్ణా
బాపురే నీ ప్రతాప భాగ్యము లివివో

చరణం:

బాలుఁడవై రేపల్లెఁ బాలు నీ వారగించఁగ
పాల జలనిధి యెంత భయపడెనో
ఆలించి తొదలుమాట లాడనేరుచుకొనఁగ
యీలీలన సురసతు లెంత భ్రమసిరో

చరణం:

తప్పటడుగులు నీవు ధరమీఁదఁ బెట్టఁగాను
తప్పక బలీంద్రుఁ డేమి దలఁచినాఁడో
అప్పుడే దాఁగిలిముచ్చు లందరితో నాడఁగాను
చెప్పేటివేదాలు నిన్నుఁ జేరి యెంత నగునో

చరణం:

సందడి గోపికల చంకలెక్కి వున్ననాఁడు
చెంది నీ వురము మీఁది శ్రీసతి యేమనెనో
విందుగ శ్రీవేంకటాద్రి విభుఁడవై యున్న నేఁడు
కందువైనదేవతలఘనత యెట్టుండునో

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం