సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: బాపు దైవమా మాపాలిభవమా
టైటిల్: బాపు దైవమా మాపాలిభవమా
పల్లవి:
ప|| బాపు దైవమా మాపాలిభవమా | తీపు రాకాసినెత్తురు దీం దోందోం దోందోం దోందోం ||
చరణం:చ|| కాలనేమిపునుకిది కంచువలె లెస్స వాగీ | తాళ మొత్తరే తత్త తత తత్తత్త |
కాలమెల్ల మాభూతగణమెల్ల వీడె కాచె | నేలబడి నేడును ధీం ధీం ధీం ధీం ధీం ధీం ధీం ||
చ|| పగగొని మానక పచ్చినెత్తు రెప్పుడును | తెగి కొను దానె తిత్తి తిత్తి తిత్తితి |
తగుమహోదరువీవు ధణధణమని వాగీ | బిగియించరో తోలు బింభిం బింభిం బింభింభిం ||
చ|| మురదనుజునిపెద్దమొదలియెముక దీసి | తురులూదరే తుత్తు తుత్తు తుత్తుత్తు |
తిరువేంకటగిరిదేవుడు గెలిచిన స- | మరమునను మమ్మ మమ్మ మమ్మ మమ్మమ్మ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం