సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: భామ శృంగారించు భావమే
టైటిల్: భామ శృంగారించు భావమే
పల్లవి:
ప|| భామ శృంగారించు భావమే యందము | కాముని రతిసాటి కాంతులీలాగు ||
చరణం:చ|| పూవొకటి వికసించె పున్నమి చంద్రుని వలెనే | పూవుమీద మరిరెండు పూలుబూసె |
రెండు పూవుల నడుమ పూసెనొకపువ్వు | పూవు కింద ముప్పదిరెండు మొగ్గలెత్తె ||
చ|| పక్షి యొక్కటి వాలె భద్రేభమనగాను | పక్షిమీదను రెండు పక్షులాయెను |
రెండు పక్షుల నడుమనే వ్రాలె నొక పక్షి | పక్షితో జోడుగా పలికే నొకపక్షి ||
చ|| చిగురునే రెంటి చెందామరో యనగ | చిగురు మీదను రెండు చిగురులెత్తె |
చిగురుబోణి యింట శ్రీ వేంకటేశుడు | చిగురు లోపలి తేనె చెలగి చవిచూచె ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం