సంకీర్తన
రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: భారము నీపై వేసి బ్రదికియుండుటే
టైటిల్: భారము నీపై వేసి బ్రదికియుండుటే
పల్లవి:
భారము నీపై వేసి బ్రదికియుండుటే మేలు
నారాయణుఁడ నీవే నాకుఁ గలవనుచూ
శరణన వెరపయ్యీ సామజముఁ గాచినట్టు
వరుస దావతిపడి వచ్చేవంటా
హరి కృష్ణ యన వెరపయ్యీ ద్రౌపదివర
మిరవుగ నిచ్చినట్టు యిచ్చేవో యనుచు
చేత మొక్క వెరపయ్యీ చీర లిచ్చి యింతులకు
బాఁతిపడ్డట్టే నన్నుఁ బైకొనే వంటా
ఆతల నమ్మఁగ వెరపయ్యీఁ బాండవులవలెఁ
గాతరాన వెంట వెంటఁ గాచియుండే వనుచు
ఆరగించుమన వెరపయ్యీ శబరివలె
ఆరయ నెంగిలి యన కంటే వంటా
యేరీతి నన వెఱతు యిచ్చైనట్ట్లఁ గావు
కూరిమి శ్రీ వేంకటేశ గోవులఁ గాచినట్లు