సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: భావమున బరబ్రహ్మమిదె
టైటిల్: భావమున బరబ్రహ్మమిదె
పల్లవి:
ప|| భావమున బరబ్రహ్మమిదె | కైవసమై మాకడ చూడన్ ||
చరణం:చ|| నీలమేఘ ముపనిషార్థం బదె | పాలుదొంగిలెడి బాలులలో |
చాలు నదియ మాజన్మరోగముల- | చీల దివియు మము జెలగించన్ ||
చ|| తనియని వేదాంత రహస్యం బదె | వొనర గోపికలవుట్లపై |
పనుపడి సకలాపజ్జాలంబుల- | పనులు దీర్చ మము బాలించన్ ||
చ|| భయములేని పెనుబరమపదం బదె| జయమగు వేంకట శైలముపై |
పయిపడు దురితపు బౌజుల నుక్కున | లయముసేయు మము లాలింపన్ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం