సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: భళి భళి రామ
పల్లవి:

ప|| భళి భళి రామ పంతపు రామ నీ- | బలిమి కెదురు లేరు భవహర రామ ||

చరణం:

చ|| విలువిద్య రామా వీర విక్రమ రామా | తలకొన్న తాటకాంతక రామా |
కొలయై బరుని తలగుండు గండ రామా | చలమరి సమరపు జయజయ రామా ||

చరణం:

చ|| రవికుల రామా రావణాంతక రామా | రవినుత ముఖ కపిరాజ రామా |
సవరగా కొండలచే జలధి గట్టిన రామా | జవ సత్త్వ సంపన్న జానకీ రామ ||

చరణం:

చ|| కౌసల్యా రామ కరుణానిధి రామ | భూసుర వరద సంభూత రామ
వేసాల పొరలే శ్రీవేంకటాద్రి రామ | దాసులమము గావ తలకొన్న రామ ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం