సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: భోగీంద్రులును మీరు
టైటిల్: భోగీంద్రులును మీరు
పల్లవి:
ప|| భోగీంద్రులును మీరు బోయి రండు | వేగగ మీదటి విభవాలకు ||
చరణం:చ|| హరుడ పోయిరా అజుడ నీవును బోయి | తిరిగిరా మీదటి తిరునాళ్ళకు |
సురలు మునులును భూసురలు బోయిరండు | అరవిరి నిన్నాళ్ళు నలసితిరి ||
చ|| జముడ పోయిరా శశియు నీవును బోయి | సుముఖుడవై రా సురల గూడి |
గుములై దిక్పతులు దిక్కులకు బోయిరండు | ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి ||
చ|| నారద సనక సనందాదులు | భూరివిభవముల బోయిరండు |
దూరముగా బోకిట్టే తొరలి వేంకటగిరి | జేరి నన్నిట్లనే సేవించుడీ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం