సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: భోగిశయనమును బుసకొట్టెడిని
టైటిల్: భోగిశయనమును బుసకొట్టెడిని
పల్లవి:
ప|| భోగి శయనమును బుసకొట్టెడినీ | యోగ నిద్ర పాయును మేల్కొనవే ||
చరణం:చ|| కన్నులు దెరవక కమల బాంధవుడు | వెన్నెల రేణువు వెలయ దిదే |
అన్నువ మలసీ నరుణోదయమిదే | మిన్నక నీవిటు మేలు కొనవే ||
చ|| తెల్లని కన్నులు దెరవక విరియగ | నొల్లక జలజము లున్నవివే |
కల్ల నిదుర నిను గవియగనియ్యక | మెల్లనాయ నిటు మేలు కొనవే ||
చ|| తెరవగు రెప్పల దెల్లవారవలె| తెరవక చీకటి దీరే దీదే |
తెరగు వేంకటాధిప నీ వెరుగుదు | మెరుగులు చల్లుచు మేలుకొనవే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం