సంకీర్తన
రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: భవరోగవైద్యుఁడైన బలువెజ్జు
టైటిల్: భవరోగవైద్యుఁడైన బలువెజ్జు
పల్లవి:
భవరోగవైద్యుఁడైన బలువెజ్జు
సవరని పైఁడిపక్షిసకినగాఁడు
తల్లివద్ద నోరిలోన తగ లోకముములు చూపి
వెల్లవిరి నింద్రజాలవిద్యవాఁడు
చెల్లుబడి నొక్కకొండ చేతఁబట్టి యెత్తినాఁడు
బల్లిదుఁడు వాఁడివో బారివిద్యవాఁడు
మునుపె సకలభూతములకు నేలికయై
మనసెల్లా నెరిగిన మంత్రవాది
చనవున జలధిలో సంప దింద్రునికిఁ జూపె
అనువరి వాఁడిలో అంజనగాఁడు
పట్టరాని కాళింగుపడిగెలమీఁదు మెట్టి
పట్టినాఁడు వాఁడువో పాములవాఁడు
అట్టె శ్రీవెంకటనాథుఁ డమరుల నెల్లనుఁ జే
పట్టి దైత్యులఁ జంపించే పాళగాఁడు
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం