సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: బలుపుడు హరి
టైటిల్: బలుపుడు హరి
పల్లవి:
ప|| బలుపుడు హరి జేపట్టితిని | తలచినదెల్లా దక్కెను నాకు ||
చరణం:చ|| దురిత ధ్వంసుడు దుఃఖవిదారుడు | అరిభయంకరు డచ్యుతుడు |
సిరివరు డితనిని జేకొని కొలిచిన | పరమసుఖమెపో భయ మెక్కడిది ||
చ|| దానవాంతకుడు దైవశిఖామణి | మానరక్షకుడు మాధవుడు |
నానాముఖముల నాపాల గలడు | యేనెపముల నా కెదురే లేడు ||
చ|| అనయము నిర్మలు డఖిలానందుడు | ఘను డీశ్రీవేంకటవిభుడు |
కనుకొని మము నిటు గాచుక తిరిగీ | యెనయగ నేలికె యితడేమాకు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం