సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: బలువగు దనరూపము చూపెన్
టైటిల్: బలువగు దనరూపము చూపెన్
పల్లవి:
ప|| బలువగు దనరూపము చూపెన్ | కలదింతయు దనఘన తెరిగించెన్ ||
చరణం:చ|| పాండవ రక్షణపరుడై నరునకు | నండనే తెలిపె మహామహిమ |
దండి విడిచి తనదయతో నర్జును- | డుండగ మగటిమి నొడబడ బలికె ||
చ|| మగుడగ కులధర్మములు బుణ్యములు | తెగి పార్థున కుపదేశించెన్ |
నగుచు నతనితో నానాగతులను | నిగమమునియమమునిజ మెరిగించెన్ ||
చ|| వెరవుమిగుల నావిజయునిమనుమని | పరీక్షిత్తు దగ బ్రదికించెన్ |
తిరువేంకటగిరిదేవుడు దానై | గరిమల భారతకథ గలిగించెన్ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం