సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: బోధకు లెవ్వరు లేక
టైటిల్: బోధకు లెవ్వరు లేక
పల్లవి:
ప|| బోధకు లెవ్వరు లేక భోగినైతిని | శ్రీధరుడే మాకు దిక్కు చింతింప నికను ||
చరణం:చ|| పట్టి దిగంబరినై పాలే యాహారముచేసి | తొట్టినపంచేంద్రియములతోవ విడిచి |
పుట్టితి సన్యాసినై బుద్ధెఱిగీనెఱగక | అట్టె నడుమ సంసారినైతి నేనూ ||
చ|| గచ్చుల నన్నీ మఱచి గాలే ఆవటించుకొని | అచ్చపుబరమయేకాంతసమాధి |
నిచ్చలు నిద్రాభ్యాసనిర్మలయోగినైతి | కచ్చుపెట్టి మేలుకొని ఘనకర్మనైతి ||
చ|| భావము పారవిడిచి బ్రహ్మాండమెల్ల నిండి | వేవేలుగోరికల వేడుకతోడ |
జీవన్ముక్తుడనైతి శ్రీవేంకటేశ్వరు జేరి | ధావతు లిన్నియు మాని తన్మయుడనైతి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం