సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: బ్రహ్మకడిగిన పాదము
పల్లవి:

బ్రహ్మకడిగిన పాదము |
బ్రహ్మము దానె నీ పాదము ||

చరణం:

చెలగి వసుధ గొలిచిన నీ పాదము |
బలితల మోపిన పాదము |
తలకక గగనము తన్నిన పాదము |
బలరిపు గాచిన పాదము ||

చరణం:

కామిని పాపము కడిగిన పాదము |
పాముతల నిడిన పాదము |
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము |
పామిడి తురగపు పాదము ||

చరణం:

పరమ యోగులకు పరి పరి విధముల |
వర మొసగెడి నీ పాదము |
తిరు వేంకటగిరి తిరమని చూపిన |
పరమ పదము నీ పాదము ||

అర్థాలు



వివరణ