సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: బయలు పందిలి వెట్టి
టైటిల్: బయలు పందిలి వెట్టి
పల్లవి:
ప|| బయలు పందిలి వెట్టి పరగ జిత్తము గలిగె | దయమాలి తిరుగ నాత్మ డొక్కడు గలిగె ||
చరణం:చ|| కనుచూపు వలన నుడుగని కోరికలు గలిగె | తనుకాంక్ష వలన బరితాపంబు గలిగె |
అనుభవమువలన మోహాంధకారము గలిగె | తనివిదీరమి వలన తలపోత గలిగె ||
చ|| అడియాసవలన పాయనిచలంబును గలిగె | కడుమమత వలన చీకటి దవ్వ గలిగె |
కడలేని తమకమున గాతాళమును గలిగె | నడుమ నంతటికి మాననిప్రేమ గలిగె ||
చ|| తరితీపువలన చిత్తభ్రాంతి తగ గలిగె | విరహంబువలన పురవేదనలు గలిగె |
తిరువేంకటాచలాధిపుని కరుణామృతము | పరిపూర్ణమైన యాపద నీద గలిగె ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం