సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చాలదా బ్రహ్మమిది
పల్లవి:

చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు
జాలెల్ల నడగించు సంకీర్తనం ||

చరణం:

సంతోష కరమైన సంకీర్తనం
సంతాప మణగించు సంకీర్తనం
జంతువుల రక్షించు సంకీర్తనం
సంతతము దలచుడీ సంకీర్తనం ||

చరణం:

సామజము గాంచినది సంకీర్తనం
సామమున కెక్కుడీ సంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం
సామాన్యమా విష్ణు సంకీర్తనం ||

చరణం:

జముబారి విడిపించు సంకీర్తనం
సమ బుద్ధి వొడమించు సంకీర్తనం
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం
శమదమాదుల జేయు సంకీర్తనం ||

చరణం:

జలజాసనుని నోరి సంకీర్తనం
చలిగొండ సుతదలచు సంకీర్తనం
చలువ గడు నాలుకకు సంకీర్తనం
చలపట్టి తలచుడీ సంకీర్తనం ||

చరణం:

సరవి సంపదలిచ్చు సంకీర్తనం
సరిలేని దిదియపో సంకీర్తనం
సరుస వేంకట విభుని సంకీర్తనం
సరుగనను దలచుడీ సంకీర్తనం ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం