సంకీర్తన
రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: చాలదా మాజన్మము
టైటిల్: చాలదా మాజన్మము
పల్లవి:
చాలదా మాజన్మము నీ- |
పాలింటివారమై బ్రదుకగగలిగె ||
కమలాసనాదులుగాననినీపై |
మమకారముసేయ మార్గము గలిగె |
అమరేంద్రాదులకందరానినీ- |
కొమరైన నామము కొనియాడగలిగె ||
సనకాదులును గానజాలనినిన్ను |
తనివోవ మతిలొన దలపోయగలిగె |
ఘనమునీంద్రులకు నగమ్యమైవున్న- |
నిను సంతతమును వర్ణింపగలిగె ||
పరమమై భవ్యమై పరగిననీ- |
యిరవిట్టిదని మాకు నెఱుగంగగలిగె |
తిరువేంకటాచలాధిప నిన్ను యీ- |
ధరమీద బలుమారు దరిసింపగలిగె ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం