సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చాలునిదే నావిరతి సకసామ్రాజ్యమ
టైటిల్: చాలునిదే నావిరతి సకసామ్రాజ్యమ
పల్లవి:
చాలునిదే నావిరతి సకసామ్రాజ్యము
నాలోనిపని యెంతైనా నాకు గలదు
వడబడి పరులిండ్లవాకిలిగాచే నేను
వడి నాలో హరియున్న వాకిలి గాచేను
బడి నొకరి గొలిచి బహురాజ్యమేలేనేను
యెడ నామనోరాజ్యమింతా నేలేను
చాలు
చరణం:చేరి యొరులకు బనిసేసి యలసేనేను
సారె నాయోగాభ్యాసాన నలసేను
అరిసి నే నడుగగ నన్యులిచ్చేయీవులు
తారి పూర్వకర్మాదిదైవమే యిచ్చీని
చాలు
చరణం:అందు సంతోషమే ఫల మిందు సంతోషమే ఫల
మందును మాయాకల్పిత మిందును మాయే
అందు నిందు శ్రీవేంకటాధీశుడే కర్త
అందైతే బరతంత్రు డిందు నే స్వతంత్రుడ
చాలు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం