సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చాటెద నిదియే సత్యము సుండ
పల్లవి:

చాటెద నిదియే సత్యము సుండో
చేటు లేదీతని సేవించినను

చరణం:

హరినొల్లనివారసురలు సుండో
సుర లీతనిదాసులు సుండో
పరమాత్ముడితడె ప్రాణము సుండో
మరుగక మఱచిన మఱి లేదికను

చరణం:

చాటె

చరణం:

వేదరక్షుకుడు విష్ణుడు సుండో
సోదించె శుకు డచ్చుగ సుండో
ఆదిబ్రహ్మగన్నాతడు సుండో
యేదెస వెదకిన నితడే ఘనుడు

చరణం:

చాటె

చరణం:

యిహపర మొసగను యీతడె సుండో
వహి నుతించె బార్వతి సుండో
రహస్య మిదివో రహి శ్రీవేంకట
మహిధరంబున మునికై నిలిచె

చరణం:

చాటె ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం