సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చదివెబో ప్రాణి సకలము
టైటిల్: చదివెబో ప్రాణి సకలము
పల్లవి:
ప|| చదివెబో ప్రాణి సకలము యీ- | చదువుమీదివిద్య చదువడాయగాని ||
చరణం:చ|| సిరులు చంచలమని చేత లధృవమని | పరగుసంసారము బయలని |
తొరలినసుఖమెల్ల దుఃఖమూలమని | యెరిగి లోభమువీడ నెరగడాయగాని ||
చ|| తలకొనిధర్మమే తలమీదమోపని | వలసీనొల్లమి దైవవశమని |
కలిమియు లేమియు గడవగ రాదని | తెలిసి లోభము వీడ దెలియడాయగాని ||
చ|| యేచిన పరహితమెంతయు దమదని | వాచవులిన్ని నెవ్వగలని |
యీచందమున వేంకటేశుచేతలని | చూచి లోభమువీడ జూడడాయగాని ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం