సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చెదరక వెలుగే
టైటిల్: చెదరక వెలుగే
పల్లవి:
ప|| చెదరక వెలుగే చేనుమేయగజొచ్చె | అదలించి తగదు నీకనువారు వేరీ ||
చరణం:చ|| చిత్త మింద్రియములచే జిక్కి కడు మద- | మెత్తిన వద్దన నిక వేరీ |
హత్తినమనసు మోహాదులతో గూడి | తత్తరించిన మాన్పదగువారు వేరీ ||
చ|| జీవుడిన్నిటికి దాజిక్కి పోయినత్రోవ | బోవజొచ్చిన బుద్ధిపొలమేది |
శ్రీవేంకటేశుని చింతాపరత గాని | కావగ నాత్మకు గతి దానేది ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం