సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చేకొంటి నిహమే
పల్లవి:

చేకొంటి నిహమే చేరినపరమని
కైకొని నీవిండు కలవేకాన

చరణం:

జగమున గలిగిన సకలభోగములు
తగిన నీ ప్రసాదములే యివి
అగపడునేబదియక్షరపంజ్తులు
నిగమగోచరపునీమంత్రములే ||

చరణం:

పొదిగొని సంసారపుత్రదార లిల
వదలని నీదాసవర్గములే
చెదరక యేపొద్దు జేయునాపనులు
కదిసిన నియ్యాగ్యాకైకర్యములే ||

చరణం:

నలుగడ మించిననాజన్మాదులు
పలుమరు లిటు నీపంపు లివి
యెలమిని శ్రీవేంకటేశ్వర నీనిక
వలసినప్పుడీ వరములు నాకు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం