సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చేకొనువారికి చేరువిదే పైకొనిజీవులభాగ్యమిదే
పల్లవి:

చేకొనువారికి చేరువిదే పైకొనిజీవులభాగ్యమిదే
యేకడ జూచిన యితరము లేదు.

చరణం:

తలపులోన నంతర్యామిదివో
తెలిసిచూచితే ద్రిష్టంబు
చలమున దనమతి సందేహించిన కలగి మూడులోకంబుల లేడు

చరణం:

వెస గనుదెఱచిన విశ్వాత్మకు డిదె
దెపల నింతటా ద్రిష్టంబు
పసిగొని తను బాపములు భ్రమించిన
కసరి సృష్టి చీకటివడు నపుడే.

చరణం:

చేరి కొలిచితే శృఈవేంకటపతి
సారె బ్రతుకునకు శాసనము
పైరగుతనలో భక్తి వదలితే
కూరిమి తెరమఱగునకును మఱగు.

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం