సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చేరి మొక్కరో నరులు
పల్లవి:

చేరి మొక్కరో నరులు శ్రీమంతుఁడీతఁడు
కోరి వరము లిచ్చు కొండవంటి సింహము // పల్లవి //

చరణం:

గద్దెమీఁదఁ గూరుచుండి కనకకసిపు జెండీ
గద్ధరి ప్రహ్లాదునిపై కరుణనిండీ
వొద్దనె మారుగొండల వువిదయుఁ దానుండీ
తిద్దుకొనె మీసాలు దివ్యనారసింహుఁడు // చేరి //

చరణం:

భవనాశిదరి దొక్కి బ్రహ్మాదులలోన నిక్కి
తివిరి ప్రతాపమున దిక్కుల కెక్కి
రవళి నారదాదుల రంగుపాటలకుఁ జొక్కి
చెవు లాలించీ నుతులు శ్రీనారసింహుఁడు // చేరి //

చరణం:

అదె కంబములోఁ బుట్టి ఆయుధాలు చేబట్టి
వెదకి అహోబలాన వేడుకఁ బుట్టి
కదిసి శ్రీ వేంకటాద్రికాంతలలో గుంపుగట్టి
వెదచల్లు మహిమల వీరనారసింహుఁడు // చేరి //

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం