సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చేసినట్టే సేసుగాక చింత మాకేలా
పల్లవి:

చేసినట్టే సేసుగాక చింత మాకేలా
వాసీ వంతూ నతనిదే వట్టిజాలియేలా

చరణం:

కర్మమూలమైనవి యీకాయపువ ర్తనలెల్లా
ధర్మమూలమైనది యీ దైవికము
మర్మమైనవా డొక్కడే మనసులోనున్న హరి
నిర్మిత మాతనిదింతే నేర నే నెంతవాడ

చరణం:

ధనమూలమైనది యీతగినప్రపంచ మెల్లా
తనువుమూలమైనది యీతపసులెల్లా
ననిచి యీరెంటికిని నారాయణుడే కర్త
కొనమొద లాతనిదే కొసరు మాకేల

చరణం:

భోగమూలమైనది యీపొందైనసంసారము
యోగమూలము విరతి కొక్కటైనది
యీగతి శ్రీవేంకటేశు డెట్టువలసిన జేసు
బాగులుగా నీతనిశ్రీపాదమే మాదిక్కు

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం