సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చేతులెత్తి మొక్కరమ్మ చేరి
పల్లవి:

ప|| చేతులెత్తి మొక్కరమ్మ చేరి యారతెత్తరమ్మ | యేతులే బూమెల్లా నిండె నీదేవునికి ||

చరణం:

చ|| తతిగొని పన్నీటిధారలు పై నించినించి | సతముగా బెద్దలు మజ్జనమార్చగా |
అతివలచనుగొండ లంగము లొత్తినందుకు | యితవులై తోచె నేడు యిందిరాపతికి ||

చరణం:

చ|| కప్పురపుధూళి మేన గలయగ గంపెడేసి | నెప్పున సందుసందుల నిగిడించగా |
చొప్పులెత్తి గొల్లెతలచూపులు దాకినకుమ్మె- | లప్పుడన్నియును గప్పె నందువల్ల హరికి ||

చరణం:

చ|| తట్టుపుణు గలది యందపుటలమేలుమంగ- | నిట్టే వురముమీద నమరించగా |
నెట్టన బచ్చి సేసిననెలతలచేతలలో | చిట్టకములెల్లా గప్పె శ్రీవేంకటపతికి ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం