సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చెక్కిటి చే యిక
టైటిల్: చెక్కిటి చే యిక
పల్లవి:
ప|| చెక్కిటి చే యిక నేల చింతలేల | అక్కరతో నాపె నీ యలపారిచీ గాక ||
చరణం:చ|| జవ్వనపు సతి తోడి సరసము | చివ్వన నీ మేనెల్లా జెమరింపించె |
పువ్వుల వసంతాలు పొలయాటలూ | నవ్వి నవ్వి నీ మనసు నాము లెక్కింపించె ||
చ|| చక్కెర బొమ్మవంటి యీ సతి పొందులు | చిక్కించి నీకు వలపు చిమ్మిరేగించె |
నిక్కి నిక్కి యాపె జూచె నీ వేడుకలు | చెక్కుల చెనకులయి సిగ్గు విడిపించె ||
చ|| అలమేలు మంగతో నెయ్యపు రతులు | నిలువెల్ల సింగారమై నీకు నమరె |
నెలవై శ్రీ వేంకటేశ నీ తమకము | అలరిన చుట్టరికమై తగిలించె ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం