సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చెలి మమ్ము
పల్లవి:

చెలి మమ్ము జెప్పమని సిగ్గుతోడదానున్నధి
తలకొని యాకెతో మంతనమాడవయ్యా ||

చరణం:

కన్నుల చూపులనే కాంత నీ కారతులెత్తీ
మన్నించి రావయ్యాలోని మల్లసాలకు
చన్నులనే నిమ్మపంద్లు సారెకుగానుకలిచ్చీ
చెన్నుగా నందుకొందువు చేయిచాచవయ్యా ||

చరణం:

పచ్చిచిగురాకు మొవిబళ్ళెము నీకుబెట్టీ
ఇచ్చ విందారగింతువు ఇయ్యకోవయ్యా
ముచ్చటగరకమలముల నిన్నుబూజించీ
కొచ్చి కాగిటిలోన జేకొనగదవయ్యా ||

చరణం:

మొలకనవ్వులనే ముత్యాలసేనవెట్టీ
లలినాపె మొము చూచి లాలించవయ్యా
అలమేలుమంగ పతివైన శ్రీ వేంకటేశ్వర
కలసితివీకె నిట్టె కరుణించవయ్యా ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం