సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చెలి నేడు తా నేమి
పల్లవి:

ప|| చెలి నేడు తా నేమి సేయునమ్మ ||
అప|| చెలియేమి సేయు నీచెలు లేమి సేయుదురు | చెలువైన విభునిమేనిచెలు వింత సేయగా ||

చరణం:

చ|| సతి నేడు బంగారుచవికెలో జిత్రంపు | గతులెంత చూపిన గడకంట జూడదు |
ఆతనిజూచిన మంచియబ్బురపు జూపులు | ఆతనివెంటనే పోయ నటుగాబోలు ||

చరణం:

చ|| తేనియలూరేటి మంచితియ్యని మాటలు మంత్ర- | గానములుగా వినుపించి కడువేసరితిమి |
వానిమాటలు విన్నవలనై నముదమున | వీనులు ముద్రించినవిధముగాబోలును ||

చరణం:

చ|| నిచ్చళపుమోమున నెయ్యము దయలువారె | బచ్చనచేతలు గుబ్బలిపై నిండనొప్పెను |
అచ్చపువేడుక వేంకటాద్రీశు డీరేయి | నెచ్చలికి నిచ్చినట్టినేరుపు గాబోలును ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం