సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చెలి పలుగోకులే
టైటిల్: చెలి పలుగోకులే
పల్లవి:
చెలి పలుగోకులే నీ సింగారము
అలరె నీ కిన్నియును అవధారు నేడు ||
అంగన నిన్ను గూడగనటు నీపై వడిసేటి
అంగపు జెమట నీకునభిశేకము
వుంగటి గొప్ప విరులు వుపరిసురత వేళ
సంగతి రాలేటి చల్లువేదపూజ ||
నించిన కాగిటిలోన నెలత నిట్టూర్పుగాలి
అంచులు మోవ విసరే యాల వట్టాలు
అంచెల మర్మము సోకనాడుకొనే మాటలు
కాంచనపు గిన్నెలతో కప్పురబాగాలు ||
వనిత విడెము తోడ వంచిన మోవితేనె
ననుపైన నీకు మహ నైవేద్యము
యెనసి శ్రీవేంకటేశ యిన్నియ గలిగె నీకు
మొనగోరి మాచేతి మొక్కు లిందవయ్యా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం