సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చెలియా నాకు నీవు
టైటిల్: చెలియా నాకు నీవు
పల్లవి:
ప|| చెలియా నాకు నీవు సేసే వుపకారమిది | వెలలేని గుణముల వేడుకకాడతడు ||
చరణం:చ|| వచ్చిన దాకా నీవు వద్దనే కాచుకుండు | మెచ్చిన దాకా గొలువు మిగులాను |
ఇచ్చగించి నందాకా నింపుగ సేవలు సేయు | అచ్చపు బొందులు సేయుమాతనికి నాకును ||
చ|| సమ్మతించి నందాక సారె విన్నపాలు సేయు | నెమ్మది బత్తైన దాకా నేర్పులు చూపు |
కొమ్మని యిచ్చిన దాకా గుట్టున జేయెత్తి మొక్కు | యిమ్ముల బొందులు సేయు మిద్దరికి నీవు ||
చ|| నవ్విన దాకా నీవు ననుపు లెల్లా జేయు- | మివ్వలి మోమైన దాకా నింపులు చల్లు |
రవ్వగా శ్రీ వేంకటరాయడిదే నన్ను గూడె | మవ్వపు బొందులు సేయు మాకు నీ వెప్పుడును ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం