సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చెలియరో నీవే కదే
పల్లవి:

ప|| చెలియరో నీవే కదే సృష్టికర్తవు | నిలువున నీ మగడు మెచ్చె నమ్మా ||

చరణం:

చ|| బొమ్మల జంకించితేనే పొద్దు గుంకినట్లెను | కమ్మి నీవు నవ్వితేనే కాయు వెన్నెల |
సొమ్మల మోవి చూపితే చుక్కలు నిండుకొనును | నెమ్మది నీ రమణుడు నిను మెచ్చెనమ్మా ||

చరణం:

చ|| పొలితి నీవు చూచితే వొద్దు వొడుచు నప్పుడే | పొలయలుకల నెండ పొడచూపును |
తిలకించి నిలిచితేదిష్టమౌను లోకమెల్ల | నెలకొని నీ విభుడు నిన్ను మెచ్చెనమ్మా ||

చరణం:

చ|| ఎక్కువై నీవు గూడితే నిరు సంజలును దోచు | మొక్కిన నీతురుముకు మూగు మేఘాలు |
వొక్కటై నీ రతులను వోలార్చగా నేడు | నిక్కి శ్రీ వేంకటేశుడు నిన్ను మెచ్చెనమ్మా ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం