సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చెల్ల నెక్కికొంటివిగా
టైటిల్: చెల్ల నెక్కికొంటివిగా
పల్లవి:
ప|| చెల్ల నెక్కికొంటివిగా జీవుడ యీబలుకోటా | బల్లిదుడ నీకు నేడు పట్టమాయ గోటా ||
చరణం:చ|| తొమ్మిదిగవనులై న దొడ్డతోలు గోటా | కొమ్మలచవులమూలకొత్తళాలకోటా |
వమ్ములేనిమెడవంపువంకదారకోటా | పమ్మి పగవారినెల్లా పట్టుకొన్న కోటా ||
చ|| తలవాకిలిదంతపుతలపులకోటా | తలిరుజేతుల పెద్దదంతెనాలకోటా |
వెలియాసలనేదండువిడిసినకోటా | గులుగై యింద్రియములు కొల్లగొన్న కోటా ||
చ|| నడచప్పరములనేనలువైనకోటా | జడిసినచెవుల మించుసవరణకోటా |
పడనిపాట్ల బడి ఫలియించె గోటా | యెడమిచ్చి శ్రీవేంకటేశు డేలె గోటా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం