సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చెల్లబో యీజీవు లిల జేసినపాప మెంతో
టైటిల్: చెల్లబో యీజీవు లిల జేసినపాప మెంతో
పల్లవి:
చెల్లబో యీజీవు లిల జేసినపాప మెంతో
వుల్లమున నున్నహరి వూరకే దవ్వాయ
కన్నచోటనే హరి కలడన్నవారికి
విన్నచోటనే విష్ణుడు వివేకులకు
వున్నతి గొలువలేక వొద్దనుండగా గొందరు
మిన్ను మీద వెదకేరు మితిమీఱ జదివి
పట్టినదే బ్రహ్మము పరమార్థవేత్తలకు
తిట్టులోనా దైవము దివ్యులకును
ముట్టి చేత మొక్క లేరు ముందటనే వుండగాను
బట్టబయలు పాకేరు బహుకర్మవిదుల
ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు
దాపున నున్నాడు హరిదాసులకును
యేపున శ్రీవేంకటేశు నేచి శరణనలేక
చాపలాన చెదకేరు సకలదేవతల
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం