సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చెల్లుగా కిట్టు నీకే
టైటిల్: చెల్లుగా కిట్టు నీకే
పల్లవి:
ప|| చెల్లుగా కిట్టు నీకే చింతింపగా పూరి- | పుల్ల మేరువుసేయ భూమిలో నిపుడు ||
చరణం:చ|| చెలగి నే మునుసేసినచేత లుండగా | మలసి నే తిరుగుతిమ్మట లుండగా |
తొలగదోసి తుప్పుడుతోడనే లోహంబు | వెలయ బంగారుగావించినగతిని ||
చ|| బిగిసి నామైనున్న పెనుకట్లుండగా | జగడగాండ్లు పగచాటగను |
జిగిగలచేతి ముసిడికాయయగు నన్ను | మొగి గల్పకముఫలముగ జేయవసమా ||
చ|| పొదలిన యింద్రియంబులు వెంట రాగా | మదవికారము నే మరుగగానే |
వదలక వేంకటేశ్వర నన్ను నిదే నీ- | పదపంకజములు చేర్పగ నిది వసమా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం