సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చెల్లునంటా వచ్చివచ్చి
టైటిల్: చెల్లునంటా వచ్చివచ్చి
పల్లవి:
ప|| చెల్లునంటా వచ్చివచ్చి చెట్టా పట్టేవు | తొల్లియు నెందరి నిట్టే దొమ్ముల బెట్టితివో ||
చరణం:చ|| ఆపరాని తమకాన నానచేసేగాక యింత | మాపుదాణ నీ తోడి మాటలేలరా- |
దాపరాని మదన ముద్రలు మేననవే నీకు | నేపుచు భ్రమల బెట్టి యెవ్వతె సేసినవో ||
చ|| ఉండలేక నీవద్దనే వుసురంటి గాక యింత | బండు బండు సేసిన యీప్రాణమేలరా |
వుండుగాగ జిత్తమెల్లా ఒక్కజేసితివి నా | యండనుండే యెవ్వతెకు నమ్ముడు వోయితివో ||
చ|| తనివొక నిన్నింత దగ్గర నిచ్చితి గాక | చనువున నిన్నుజేయి చాచనిత్తునా |
ఘనుడు వేంకటరాయ కమ్మని యీవిరులు | మునుప నెచ్చతో నీపైముడిచి వేసినవో ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం