సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చెలులాల యీమేలు
టైటిల్: చెలులాల యీమేలు
పల్లవి:
ప|| చెలులాల యీమేలు చెలువుడే చూచుగాని | యెలమి తోడుత మొక్కి యెరిగించరే ||
చరణం:చ|| వనిత జవ్వనపు వసంతకాలములోనే | వెనుకొని విరహపు వేసవి మించె |
ననిచె బెంజెమట వానకాలము నంతలోనె | వినయముతో బతికి విన్నవించరే ||
చ|| కాంత పులకల శరత్కాలము నదె తోచె | చింతల మంచులతో హేమంతము ముంచె |
చెంత గోర్కులెన్నులెత్తి శిశిరవేళ యేతెంచె | యింతకు నీకె విభుని దోడి తేరె ||
చ|| చెలియకు గొప్పువీడె చీఅటికాలము నందె | నెలకొన సిగ్గుల వెన్నెలకాలము |
అలమె శ్రీవేంకటేశుడంతలోనె తానెవచ్చె | పిలిచి సారెకునిట్టె ప్రేమరేచరే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం