సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చెలులారా చూడరే యీ
పల్లవి:

ప|| చెలులారా చూడరే యీ చెలి భాగ్యము | అలమేలుమంగ యీకె కబ్బెను యీ భాగ్యము ||

చరణం:

చ|| పతిదయ కలిగిన పడతిదీ భాగ్యము | అతడు మాట మీరనీదది భాగ్యము |
సతతముబాయక జంటై వుండేది భాగ్యము | అతివలందరు గల్లా నది యేమి చెప్పరే ||

చరణం:

చ|| మగడు మన్నించిన మగువది భాగ్యము | సొగసి యాతడు మోహించుట భాగ్యము |
వెగటులేని రతుల వేసర నిది భాగ్యము | మగువల వలపుల మరి యేమి భాగ్యము ||

చరణం:

చ|| శ్రీ వేంకటేశుడేలే మచ్చిక నీ సతిది భాగ్య- | మావేళ నాతడు మెచ్చినది భాగ్యము |
తావుకొని యెప్పుడూ దనవాడౌటే భాగ్యము | యేవనితల నేరుపులిక నేమి చెప్పరే ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం