సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చెప్పినంతపని నేజేయగలవాడ
టైటిల్: చెప్పినంతపని నేజేయగలవాడ
పల్లవి:
ప|| చెప్పినంతపని నేజేయగలవాడ నింతే | అప్పటి నపరాధమా ఆదరించవలదా ||
చరణం:చ|| నీయాజ్ఞ దేహము నేమోచితి నింతే | యీయెడ విజ్ఞానమేల యియ్యవయ్యా |
వేయివేలై వేగుదాకా వెట్టిసేసి యలసితి | వొయ్యన కొంతైన వూరడించ వలదా ||
చ|| నీవుసేసే కర్మము నేజేయువాడ నింతే | యీవల నానాందసుఖ మియ్యవయ్యా |
కోవరమై వెంటవెంట గొలిచినబంట్లకు | తావుల గొంతవడైనా దప్పిదీర్చవలదా ||
చ|| మతిలో శ్రీవేంకటేశ మనికైనవాడ నింతే | తతి నాపాటుకు దయదలచవయ్యా |
యితవై పనిసేసేటి యింటిపసురమునకు | వెతదీర్చ బాలార్చి వెడ్డువెట్టదగదా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం