సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఛీ ఛీ నరులదేట
టైటిల్: ఛీ ఛీ నరులదేట
పల్లవి:
ఛీ ఛీ నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక
చరణం:అడవిలో మృగజాతియైన గావచ్చుగాక వడినితరుల గొలువఁగ వచ్చునా
వుడివోని పక్షియైవుండవచ్చుగాక విడువకెవ్వరినైనా వేడవచ్చునా
పసురమై వెదలేని పాటుపడవచ్చుగాక కసివో నొరుల బొగడగావచ్చునా
వుసురుమానై పుట్టి వుండనైనవచ్చుగాక విసువక వీరివారి వేసరించవచ్చ్చునా
యెమ్మెల బుణ్యాలుసేసి యిల యేలవచ్చుగాక కమ్మి హరిదాసుడు గావచ్చునా
నెమ్మది శ్రీ వేంకటేశ నీ చిత్తమేకాక దొమ్ముల కర్మములివి తోయవచ్చునా