సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చీచీ వోబదుకా సిగ్గులేనిబదుకా
టైటిల్: చీచీ వోబదుకా సిగ్గులేనిబదుకా
పల్లవి:
ప|| చీచీ వోబదుకా సిగ్గులేనిబదుకా | వాచవికి బతిమాలి వడబడ్డబదుకా ||
చరణం:చ||| ఆసలకు జోటు గద్దు అంతరంగాన నెంతైన | వీసమంతా జోటు లేదు విరతికి |
యీసున సంసారమున కెందరైనా గలరు | వోసరించి మోక్షమియ్య నొకరు లేదు ||
చ|| భోగించ వేళ గద్దు పొద్దువొడపుగుంకును | వెగమే హరిదలచ వేళలేదు |
వోగులలంపటమున కోపి కెంతైనా గద్దు | యోగపుసత్కర్మాన కొకయింత లేదు ||
చ|| యెదుట ప్రపంచాన కెఱు కెంతైనా గద్దు | యిదివో యాత్మజ్ఞాన మించుకా లేదు |
మది శ్రీవేంకటేశుడు మమ్ము నిట్టె కాచెగాని | పదరి నా నేరములు పాప మఱి లేరు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం