సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చిక్కువడ్డపనికి జేసినదే చేత
టైటిల్: చిక్కువడ్డపనికి జేసినదే చేత
పల్లవి:
చిక్కువడ్డపనికి జేసినదే చేత
లెక్కలేనియప్పునకు లేమే కలిమి
తగవులేమి కెదిరిధనమే తనసొమ్ము
జగడగానికి విరసమే కూడు
తెగుదెంపులేమికి దీనగతే దిక్కు
బిగువుగూటికి వట్టిబీరమే తగవు
చిక్కు
చరణం:పతిలేనిభూమికి బలవంతుడే రాజు
గతిలేనికూటికి గన్నదే కూడు
సతిలేనివానికి జరగినదే యాలు
కుతదీరుటకు రచ్చకొట్టమే యిల్లు
చిక్కు
చరణం:యెదురులేమికి దమకేదైనదలపిది
మదమత్తునకు దనమఱపే మాట
తుదిపదమునకు జేదొడై నవిభవము
పదిలపుశ్రీవేంకటపతియే యెఱుక
చిక్కు
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం