సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చిరంతనుడు శ్రీవరుడు
టైటిల్: చిరంతనుడు శ్రీవరుడు
పల్లవి:
ప|| చిరంతనుడు శ్రీవరుడు | పరమం భవ్యం పావనం ||
చరణం:చ|| వేదమయుడు కోవిదు డమలుడు పరు- | డాదిపురుషుడు మహామహుడు |
యేదెస నేమని యేది దలచిన న- | భేద మవాది మఖిలసమ్మతం ||
చ|| నిఖిలనిలయుడు మునివరదు డధికుడు | మఖముఖశుకాభిమతరతుడు |
శిఖిరం శివం సుశీలన మతిశయ | ముఖరం ముఖ్యం మూలమిదం ||
చ|| అనేకప్రదు డనాదినిధనుడు | ఘను డీతిరువేంకటవిభుడు |
దినందినం సముదితరవికోటిభ- | జనం సిద్ధాంజనం ధనం ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం