సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చిత్త మతిచంచలము
టైటిల్: చిత్త మతిచంచలము
పల్లవి:
ప|| చిత్త మతిచంచలము చేత బలవంతంబు | తిత్తితో జీవుడిటు దిరిగాడుగాక ||
చరణం:చ|| కదిసి జీవుడు పుట్టగా బుట్టినటువంటి- | మొదలు దుదియునులేని మోహపాశములు |
వదలు టెటువలె దారు వదలించు టెటువలెను | పదిలముగ వీనిచే బడి పొరలుగాక ||
చ|| కడలేని జన్మసంగ్రహములై యెన్నడును | గడుగవసములుగాని కర్మపంకములు |
విడుచు టెటువలె దారు వదలించు టెటువలెను | విడువని విలాపమున వేగుటలుగాక ||
చ|| యిందులోపల జీవుడెన్నడే నొకమాటు | కందువెఱిగి వివేకగతుల భాగ్యమున |
అందముగ దిరువేంకటాద్రీశు సేవించి | అందరాని సుఖంబు లందుగాక ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం