సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చిత్తజగరుడ శ్రీనరసింహ
టైటిల్: చిత్తజగరుడ శ్రీనరసింహ
పల్లవి:
ప|| చిత్తజగరుడ శ్రీనరసింహ | బత్తి సేసేరు మునులు పరికించవయ్య ||
చరణం:చ|| సకలదేవతలును జయవెట్టు చున్నారు | చకితులై దనవులు సమసిరదె |
అకలంకయగు లక్ష్మి అటు నీతొడపై నెక్కె | ప్రకటమైన నీకోపము మానవయ్య ||
చ|| తుంబురు నారదులు దొరకొని పాడేరు | అంబుజాసనుండభయమ డిగీనదె |
అంబరవీధి నాడేరు అచర లందరు గూడి | శంబరరిపు జనక శాంతము చూపవయ్యా ||
చ|| హత్తి కొలిచేరదె యక్షులును గంధర్వులు | చిత్తగించు పొగడేరు సిద్ధ సాధ్యులు |
సత్తుగ నీ దాసులము శరణుజొచ్చితిమిదె | ఇత్తల శ్రీవేంకటేశ ఏలు కొనవయ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం