సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చిత్తజు వేడుకొనరే చెలియలా
టైటిల్: చిత్తజు వేడుకొనరే చెలియలా
పల్లవి:
ప|| చిత్తజు వేడుకొనరే చెలియలా | తత్తరించి పతిమీది తలపోత నున్నది ||
చరణం:చ|| అతివపై మదనుడు అనలాస్త్ర మేయబోలు | కతలుగ విరహాగ్నిగాగీనదే |
యితవుగా వరుణాస్త్ర మేయబోలు నప్పటిని | తతి జెమటవానల దడియుచునున్నది ||
చ|| అమరగ నంతలో వాయవ్యాస్త్రమేయబోలు | వుమరబడి నిట్టూర్పులొగి రేగెను |
జమళిగూడగ నట్టె శైలాస్త్రమేయబోలు | భ్రమసి చనుగొండలు బాయిటగాన్పించెను ||
చ|| మునుకొని పంతాన సమ్మోహనాస్త్రమేయబోలు | మనసు పరవశాన మరపందెను |
అనిశము రక్షగా నారాయణాస్త్రమేయబోలు | ఘన శ్రీవేంకటేశుడు కాగిటిలోగూడెను ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం