సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చిత్తమెందుండెనో యంటా
టైటిల్: చిత్తమెందుండెనో యంటా
పల్లవి:
ప|| చిత్తమెందుండెనో యంటా సిబ్బితిపడే నేను | కొత్తలేమిగలిగినా గోరి తెలుసుకొమ్మీ ||
చరణం:చ|| నివ్వటిల్లి కొలువరో నీవున్న భావము చూచి | యెవ్వతె యేమాడునో యేమి సేసునో |
పువ్వువలె బొదుగుదు భోగించువేళ నేను | నవ్వుల నీ మైరేకలు నావిగావు సుమ్మీ ||
చ|| వూరు వారి సొమ్ములెల్ల నొగిబెట్టుక రాగాను | యేరీతి నున్నాడవో నాకెట్టు దెలుసు |
నేరుపుతో సింగారింతు నీ మేను సోకేటి వేళ | భారపు దండలు నాకు బనిలేదు సుమ్మీ ||
చ|| సందడి నీ మోమునకు సరికళలు రేగెను | యెందు గలదో మోహమెరుగుదునా |
పొందితి శ్రీ వేంకటేశ పొరపొచ్చెము లేకుండ | విందుల నీ మోవితేనె వేరుసేయసుమ్మీ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం