సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చిత్తమో కర్మమో జీవుడో
టైటిల్: చిత్తమో కర్మమో జీవుడో
పల్లవి:
ప|| చిత్తమో కర్మమో జీవుడో దేవుడో | వొత్తినయీచేత లొకరివి గావు ||
చరణం:చ|| పదిలమైన మోహపాశంబులు దెచ్చి | మెదలకుండగ నాకు మెడ జుట్టి |
యెదిరివారు నవ్వ నింటింట దిరిగించి | తుదలేనియాసల దుఃఖాంతరుని జేసె ||
చ|| కొలదిమీర జన్మకోట్ల బెనగొని | తొలగని నాలోని దురితము |
తొలగింప నాలుకతుదకు నీపేరిచ్చి | తెలుపు మింతియు చాలు దిరువేంకటేశా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం