సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చిత్తములో నిన్ను
టైటిల్: చిత్తములో నిన్ను
పల్లవి:
ప|| చిత్తములో నిన్ను జింతింపనేరక | మత్తుడనై పులుమానిసినైతి ||
చరణం:చ|| ఆరుత లింగము గట్టి యది నమ్మజాలక | పరువత మేగినబత్తుడ నైతి |
సరుస మేకపిల్ల జంకబెట్టుక నూత- | నరయుగొల్లనిరీతి నజ్ఞాని నైతి ||
చ|| ముడుపు కొంగునగట్టి మూలమూలల వెదికే | పెడమతినై నేవ్యర్థుడనైతి |
విడువకిక్కడ శ్రీవేంకటేశ్వరుడుండ | పొడగానక మందబుద్ధి నేనైతి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం